Karthika Deepam2 : నా కూతురిపై పిన్నికి ఎందుకు అంత కేరింగ్ అండ్ ఇంట్రస్ట్.. దశరథ్ కి డౌట్!
on Jan 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -243 లో..... అసలైన వారసురాలు ఎవరో చెప్పడానికి సుమిత్ర దగ్గరికి వస్తాడు దాస్. దాంతో దాస్ రావడం జ్యోత్స్న చూసి తనని బయటనే ఆపుతుంది. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అనగానే.. సుమిత్ర వదినకి నిజం చెప్పడానికి వచ్చానని దాస్ అంటాడు. వద్దు మీరు నిజం చెప్తే నేను ఉండనంటు దాస్ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న కాళ్ళు పట్టుకోవడం పారిజాతం దూరం నుండి చూసి షాక్ అవుతుంది.
అసలు వాళ్లేం మాట్లాడుకుంటున్నారని పారిజాతం అనుకుంటుంది. నిజం చెప్పను చెప్పి కన్న కూతురిని దూరం చేసుకోలేనని చెప్పి దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు శౌర్యకి నిద్ర పట్టక బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే దీప, కార్తీక్ లు వస్తారు. ఏమైంది అని శౌర్యని అడుగుతారు. దోమలు కుడుతున్నాయి.. నిద్ర పట్టడం లేదని శౌర్య అనగానే.. ఇక్కడ చల్లగా ఉందంటూ అటు ఇటు తింపుతాడు కార్తీక్. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి.. నువ్వెందుకు దాస్ కాళ్ళు పట్టుకున్నావని అడుగుతుంది. అదేం లేదు నేను అసలైన వారసురాలు కాదని చెప్తానన్నాడు దాంతో అలా చేసానని జ్యోత్స్న చెప్తుంది. కానీ పారిజాతానికి తను చెప్పింది అబద్ధమని అర్ధమవుతుంది.
మరొకవైపు టిఫిన్ బండి పై కార్తీక్ దీపలు కవర్ కప్పుతారు. మరుసటిరోజు నువ్వేదో దాస్తున్నావ్.. నేను ఆఫీస్ కి వస్తానని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా శివన్నారాయణని పిలిచి.. చూడు గ్రానీ ఆఫీస్ కి వస్తుందట అని అంటుంది. శివన్నారాయణ విని పారిజాతాన్ని తిట్టి పంపిస్తాడు. ఆ తర్వాత ఎందుకు మా పిన్ని నా కూతురుపై అంత ఇంట్రెస్ట్ కేర్ చూపిస్తదని సుమిత్రతో దశరథ్ అంటాడు. మీరు అలాంటి అనుమానం ఏం పెట్టుకోకని దశరత్ తో సుమిత్ర అంటుంది. ఆ తర్వాత టిఫిన్ సెంటర్ దగ్గరికి ఒక తాగుబోతు వచ్చి.. అది తీసుకొని రా.. ఇది తీసుకొని రా అంటూ దీప తో దురుసుగా మాట్లాడతాడు. అప్పుడే ఒక పాప ఆకలిగా ఉంది.. మా అమ్మ కుడా ఏం తినలేదని చెప్పగానే వాళ్లు తినడానికి టిఫిన్ ఇస్తుంది దీప. దాంతో ఆ పాప దీపని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలి సిందే.
Also Read